Header Banner

గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!

  Tue Mar 11, 2025 17:27        Politics

గత ప్రభుత్వంలో మహిళాధ్యక్షురాలిగా ఒక బుక్ లెట్ తో డీజీపీ ఆఫీస్ వెళ్లే కేసు పెట్టారు: హోంమంత్రి అనిత

నా పైన మొత్తం గత ప్రభుత్వం 23 కేసులు పెట్టింది

గత వైసీపీ పాలనలో ప్రతి 8 నిమిషాలకి ఒక అఘాయిత్యం

టీడీపీ, నాయకులే టార్గెట్ గా గత పోలీస్ యంత్రాంగం పని చేసింది

చిన్నారులు, మహిళలకు రక్షణగా రూ.17కోట్లతో ప్రత్యేక రక్షణ విభాగం

మహిళలపై అఘాయిత్యాల విచారణలో ప్రత్యేక దృష్టి

మహిళా దినోత్సవం నాడు శక్తి యాప్ ను సీఎం చేతులమీదుగా ఆవిష్కరణ

శక్తి యాప్ పై అవగాహన కలిగించడంలో ప్రతి ఒక్కరూ చొరవ చూపాలి

112కు ఫోన్ చేస్తే అర్ధరాత్రులు సైతం ఆడపిల్లలకి పోలీసుల అండ

మహిళల కోసం ప్రత్యేక నైట్ షెల్టర్లను అందుబాటులోకి తెచ్చాం

అనకాపల్లిలోని నా నియోజకవర్గంలో శక్తి టీమ్స్ సేవలు ప్రారంభించాం

పులుల్లా పని చేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు

అమ్మాయిలపై దాడులకు సంబంధించి సమాచారం వస్తే 15 నిమిషాలలో పోలీసులు వచ్చేస్తారు

పట్టణాల్లో అయితే 5 నుంచి 10 నిమిషాల్లో వచ్చి కాపాడుతారు

కొత్త జిల్లాలకు ఎస్పీ కార్యాలయాలు లేవు

రూ.పోలీస్ స్టేషన్లు, కార్యాలయ భవనాలకు రూ.50కోట్ల పైన బడ్జెట్ లో కేటాయించాం

చిత్తూరు. రాజమండ్రి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో రిజర్వ్డ్ బెటాలియన్ల ఏర్పాటు

ప్రతి పోలీస్ స్టేషన్ కి 2 డ్రోన్ల ద్వారా రద్దీ ప్రాంతాలలో పటిష్ట నిఘా

డ్రోన్ ద్వారా ట్రాపిక్ నియంత్రణ దిశగా అడుగులు


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

గత ఐదేళ్లలో ఒక్క వాహనం కొనలేదు..కొన్నవాటికి కూడా బిల్లులు ఇవ్వలేదు..ఓ బ్యాంకు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది

రూ.300 కోట్లతో 2812 పోలీస్ వాహనాల ఏర్పాటుకు కేటాయింపులు

పోలీసులకు 150 లీటర్ల నుంచి 300 లీటర్ల ఇంధనం ఇచ్చేందుకు బడ్జెట్ లో కేటాయించాం

పోలీస్ ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ 25 లీటర్ల నుంచి 50 లీటర్లకు పెంపు

ఇన్వెస్టిగేషన్ ఛార్జీల కింద వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ పైసా కేటయించలేదు

ఎస్ఎల్ఎస్‌సీ, ఏఎస్ఎల్ఎస్‌సీ, జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్ మెంట్ దశలవారీగా చెల్లిస్తాం

పోలీస్ సంక్షేమంలో భాగంగా గత రెండేళ్లు నిలిచిపోయిన జీపీఏని పునరుద్ధరించాం

రూ.20కోట్లు పోలీస్ వెల్ఫేర్ కోసం కేటాయించాం

ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం రూ.152 కోట్లు కేంద్రమిచ్చినా కావాలనే కక్షకట్టి నిర్మాణం ఆపారు

కేవలం అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారనే అక్కసే కారణం

21 రోజుల్లో ఉరితీసే దిశ చట్టం తీసుకురావడం విడ్డూరం

ఫోరెన్సిక్ వ్యవస్థ లేదు, పామ్ , ఫింగర్ ప్రింట్ గుర్తించే వ్యవస్థ, సీసీ కెమెరా, డ్రోన్‌లు లేకుండా ఉరి శిక్ష వేస్తారా?

అన్ని సదుపాయాలిస్తే పోలీసులు 90 రోజుల్లో శిక్ష అమలు చేయగలరు

విజయనగరం జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే ఫోక్సో కోర్టు ద్వారా 3 నెలల్లో శిక్ష విధించాం

బెయిల్ రాకముందే నిన్ననే నిందితుడికి 25 సంవత్సరాల శిక్ష పడేలా చేశాం

ఏ అఘాయిత్యం జరిగినా 24గంటల్లో పట్టుకుంటున్నాం

రూ.24 కోట్లు ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ పూర్తి కోసం కేంద్ర హోంశాఖ నిధులిచ్చింది


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ పునర్విభజన కింద చేయాల్సిన గ్రేహౌండ్స్, అప్పాలను ఏర్పాటు చేస్తాం

2017-18లో కేంద్రప్రభుత్వం రూ.295 కోట్లు మంజూరు చేసింది

యూసీ సర్టిఫికెట్లు సమర్పించకపోవడం వల్ల రావల్సిన రూ.9కోట్లు కూడా రాలేదు

విజయనగరం జిల్లా రెల్లి గ్రామంలో 500 ఎకరాల విస్తీర్ణంలో గ్రేహౌండ్స్ ను ఏర్పాటు చేస్తాం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా) లేని రాష్ట్రం మనదే

ఏలూరు జిల్లా నిగుండపల్లిలో 165 ఎకరాలలో అప్పాను ఏర్పాటు చేస్తాం

పోలీసులకు పర్సనల్ ట్రావెల్ అలవెన్స్‌ను రూ.100 కోట్ల నుంచి రూ.125 కోట్లకు పెంచాం

గతంలో ఒక్కసారి కూడా అడిషనల్ సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు

సరెండర్ లీవ్స్ కింద రూ.10 కోట్లు కేటాయించాం

పోలీసు కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం గతంలోని రూ.2 లక్షల నుంచి ఇపుడు రూ.15 లక్షలు హైబ్రిడ్ మోడల్ మొత్తం కుటుంబానికి తీసుకువస్తున్నాం

హోంశాఖలో 18 మంది విభాగాధిపతులు, 15వేల మంది హోంగార్డులు, 75,600 మంది సిబ్బంది ఉన్నారు

డైరెక్టర్ ప్రాసిక్యూషన్ కూడా హోంశాఖ నియంత్రణలో భాగం

24 జిల్లాల పోలీస్ యూనిట్లు, 2 పోలీస్ కమిషనరేట్లు, 114 పోలీస్ సబ్‌డివిజన్లు, 216 పోలీస్ సర్కిళ్లు, 1026 పోలీస్ స్టేషన్లు హోంశాఖలో భాగం

మహిళల మీద జరిగే నేరాలు 10.76 శాతం తగ్గుదల

ఎస్సీ, ఎస్టీలపై దాడులు 10.56 శాతం తగ్గుదల

గత ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీలే లక్ష్యంగా దాడులు

తోటచంద్రయ్యను రాక్షసంగా చంపినందుకు సీఐడీ ద్వారా వేగంగా విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి కూడా చెప్పాలి

సీబీఐ విచారణ వేగంగా పూర్తి చేయించి వివేకా కుమార్తెకు న్యాయం చేస్తాం

వీఆర్ జీతాల గురించి ముఖ్యమంత్రి సూచనలతో ముందుకెళతాం

జీతాలివ్వకుండా వీఆర్ లో పెట్టి గత ప్రభుత్వం అన్ని పనులు చేయించుకుంది

న్యాయ సలహా తీసుకుని సూపర్‌న్యూమరీ ప్రమోషన్లు పూర్తి చేస్తాం

శాంతిభద్రతలు, మహిళల భద్రతకు చిత్తశుద్ధిగా ముందుకెళుతున్నాం : హోంమంత్రి అనిత

రూ.8570 కోట్ల హోంశాఖ బడ్జెట్ ను ఆమోదించిన శాసనసభ

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #homeminister #ycp casefile #todaynews #flashnews #latestnews